‘సంజీవని’ వైద్య సేవలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

‘సంజీవని’ వైద్య సేవలకు సిద్ధం కావాలి

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో ‘సంజీవని’ వైద్య సేవలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, ‘సంజీవని’ కింద వైద్య సేవలను డిసెంబరు 5వ తేదీ నుంచి ప్రారంభించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 74 వైద్య అప్లికేషన్లు (పోర్టళ్లు తదితరాలు) అనుసంధానం చేస్తారని తెలిపారు. ఒక వ్యక్తికి సంబంధించిన సమగ్ర ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడమే కాకుండా, ప్రత్యేక గుర్తింపు నంబరు ద్వారా ఎక్కడకు, ఏ వైద్యం కోసం వెళ్లినా రిఫరెన్స్‌గా ఉంటుందని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ మక్కెన పద్మావతి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి. రంగా రావు, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ ప్రకాష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చూడండి

జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా (ఔట్‌బ్రేక్‌) సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. డిస్ట్రిక్ట్‌ జాయింట్‌ ఔట్‌బ్రేక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (డీజేఓఆర్‌టీ) సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎక్కడైనా ఏ వ్యాధి ప్రబలినా తక్షణమే సమాచారం అందించాలని అన్నారు. తెనాలిలోని జిల్లా ఆసుపత్రితో పాటు ప్రత్తిపాడు, పొన్నూరు ఆసుపత్రుల్లో మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు జనవరి ఒకటో తేదీ నాటికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement