శివాలయానికి కార్తిక కళ | - | Sakshi
Sakshi News home page

శివాలయానికి కార్తిక కళ

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

శివాలయానికి కార్తిక కళ

పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం కార్తిక మాస పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తిక మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్‌ పి. శ్రీనివాసులరెడ్డి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో భక్తులు స్నానాలు ఆచరించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వెంట తెచ్చుకున్న పూజా సామగ్రితో కార్తిక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉచిత అన్నప్రసాద పంపిణీని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ పి. శ్రీనివాసులరెడ్డి, పాలకవర్గం చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగా పాలు, తాగునీరు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిఫార్సులపై దర్శనాలకు చెక్‌ పెట్టారు. వివిధ సేవా కార్యక్రమాలు, విరాళాలు, ప్రసాద విక్రయాల ద్వారా స్వామి వారికి రూ. 5.90 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement