ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

చెలరేగుతున్న చోరులు ● ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో దోపిడీ దొంగలు ముగ్గురు మహిళలను హతమార్చారు. కొత్తపేట వంతెన బజారు వద్ద నివాసం ఉంటున్న కోటిరత్నం (75) అనే వృద్ధురాలిపై పట్టపగలే దుండగులు దాడిచేసి బంగారం కోసం హత్య చేశారు. ఈ ఘటన 2024 జూన్‌ 19న జరిగింది. అనంతరం మరుసటి ఏడాది మార్చి 17వ తేదీన కొప్పరపు సావిత్రి అనే వృద్ధురాలిని దుండగులు హతమార్చి బంగారం దోచుకెళ్లారు. అదే ఏడాది ఆగస్టు 21వ తేదీన వినుకొండ పట్టణంలోని కల్యాణపురి కాలనీకి చెందిన ఆలపాటి పుష్పలతను బంగారం కోసం హత్య చేశారు. ● తాజాగా యడ్లపాడు గ్రామంలో పార్వతి నాగలక్ష్మి అనే మహిళ ఇంట్లో లేని సమయంలో 8వ తేదీన సుమారు రూ.75 లక్షల విలువ చేసే బంగారం, వెండి, కొంత నగదు చోరీ అయ్యాయి. ● గుంటూరు నగరంలో శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌లో గత ఏడాది జనవరి 12న ఓ ఇంట్లో వృద్ధుడు నిద్రిస్తుండగా దొంగలు చొరబడ్డారు. 379 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 20 నెలల తరువాత దొంగలను పట్టుకున్న పోలీసులు 124 గ్రాముల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారు. అదీ బాధితుడికి ఇవ్వలేదు. ● రాజధాని ప్రాంతమైన మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో ఈ ఏడాది జూన్‌ 14వ తేదీ రాత్రి ఓ అడ్వకేట్‌ నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం చోటుచేసుకుంది. సుమారు 475 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలకంపాడు వద్ద ఈ నెల 7వ తేదీన తాళం వేసిన ఇంట్లో సుమారు 200 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. ● గుంటూరు నగరంలో ఈ ఏడాది జులై 7న చంద్రమౌళినగర్‌లో ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాగునీరు ఇవ్వమని అడిగారు. తర్వాత ఆమైపె దాడి చేసి చేతికి ఉన్న 24 గ్రాముల బంగారు గాజులు లాక్కుని పరారయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 6న రాజేంద్రనగర్‌ ఒకటో లైనుకు చెందిన సీతమ్మ (88) అనే వృద్ధురాలిపై దాడిచేసి మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. అండర్‌–19 క్రికెట్‌ జట్టుకు గుంటూరు క్రీడాకారులు ఎంపిక కొమ్మమూరు బ్రిడ్జిపై నిలిచిన లారీ సాగర్‌ కుడి కాలువను పరిశీలించిన ఎస్‌ఈ పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

న్యూస్‌రీల్‌

నేరాల నియంత్రణలో చంద్రబాబు సర్కార్‌ ఘోర వైఫల్యం తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యం సొత్తు దోచుకోవడమే కాకుండా హత్యలకూ వెనుకాడని దుండగులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో హడలిపోతున్న ప్రజలు చాలా కేసుల్లో నిందితులను అరెస్టు చేయని పోలీసులు సొత్తు రికవరీలోనూ చేతివాటం చూపుతున్న సిబ్బంది

రికవరీలో చేతివాటం

గుంటూరు ఈస్ట్‌లోని ఓ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనంలో 379 గ్రాముల బంగారం చోరీకి గురైంది. 20 నెలల తరువాత దొంగలను పట్టుకున్న పోలీసులు కేవలం 124 గ్రాముల బంగారం మాత్రమే రికవరీ చూపారు. దీనిపై బాధితులు అనుమానంతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఇంతవరకు తమ చేతికి అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వినుకొండ పట్టణంలో ఓ మహిళ ఇంటి ముందు కూర్చుని ఉండగా, కళ్లల్లో కారం చల్లి 30 గ్రాముల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఈ కేసులో దొంగను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు బంగారాన్ని రికవరీ చేయలేదని చెబుతున్నారు. స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు.

గుంటూరు వెస్ట్‌ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లోనూ దొంగను పట్టుకున్న పోలీసులు సగం సొత్తు కూడా రికవరీ చేయలేదు. బాధితులు పోలీసులను ప్రశ్నిస్తే ‘పోయిన బంగారానికి బిల్లులు ఉన్నాయా’ అంటూ తిరిగి బెదిరించేలా మాట్లాడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు సగం సొత్తు కూడా రికవరీ చేయకుండా బాధితులకు ఇబ్బందులు పెడుతున్నారని పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే దోపిడీ ముఠాలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడంతో బయట రాష్ట్రాల వారితోపాటు జిల్లాకు చెందిన కొంతమంది కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పల్నాడులో హత్యలు..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీల పరంపరను పరిశీలిస్తే.. అధిక శాతం దొంగతనాలు తాళాలు వేసి ఊరికి వెళ్లిన వారి ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను ముందుగానే రెక్కీ వేసి ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. 80 శాతం దొంగతనాలు ఇలాంటివే కావడం గమనార్హం.

గుంటూరు జిల్లాలో...

బాపట్ల జిల్లాలో...

బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, మార్టూరు వంటి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో భారీ మొత్తంలో సొత్తు చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో సొత్తు మాత్రం రికవరీ చేయని పరిస్థితి నెలకొంది. వినుకొండ పట్టణంలో వరుస దొంగతనాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించి రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి దొంగతనాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

లక్ష్మీపురం: క్రికెట్‌ అండర్‌–19 వన్డే ఆంధ్రా జట్టుకు గుంటూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎ.దేవ ప్రమోద్‌ వికెట్‌ కీపర్‌ కం బ్యాటర్‌, ఎం. శ్రీ సమన్విదత్త ఓపెనింగ్‌ బ్యాటర్‌గా, కె.వి.కౌశిక్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా, ఎస్‌.కె. అబ్దుల్‌ జబ్బర్‌ లెగ్‌ స్పిన్నర్‌గా జిల్లా, జోనల్‌ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు త్రీ మెన్‌ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. త్వరలో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్‌కి, సెలక్షన్‌ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

గంటల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం

చేబ్రోలు: చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న కొమ్మమూరు బ్రిడ్జిపై శనివారం రాత్రి లారీ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీ.ల పొడువున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎనిమిది రోజుల కిందట కొమ్మమూరు బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. పెద్ద వాహనాలు బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. పొన్నూరు వైపు లారీ వెళుతుండగా బ్రిడ్జిపైభాగంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. లారీ ఆగిపోవటంతో దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. రెండు వైపులా సుమారు ఐదు కి.మీ. మేరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బ్రిడ్జి దాటడానికి వాహనదారులకు గంటలకొద్దీ సమయం పట్టడంతో అవస్థలు తప్పలేదు. మరోవైపు వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయినప్పటికీ ట్రాఫిక్‌ పూర్తి స్థాయిలో క్లియర్‌ కాకపోవడంతో పోలీసులకు కూడా కష్టాలు తప్పలేదు.

ఈపూరు: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్‌ జలాలను విడుదల చేసిన క్రమంలో 85వ మైలు సమీపంలో కుడి ప్రధాన కాలువను ఎస్‌ఈ టి. రమేష్‌ శనివారం పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహ కొలతలను తెలుసుకున్నారు. నీటి వృథా జరగకుండా కాలువలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను పరిగణనలో తీసుకుని తాగునీటి చెరువులను సకాలంలో నింపాలని ఆదేశించారు. వెంట ఈఈ ఆర్‌.మల్లికార్జున, డీఈఈ షేక్‌ ఖాదర్‌, ఏఈ ఎం యుగంధర్‌ ఉన్నారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,535 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హై లెవెల్‌కి 96 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 604, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 150, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడంతో పాటు, దొంగలు దొరికినా బాధితులు పోగొట్టుకున్న సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో వారి చేతికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోరులు చెలరేగిపోతున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లోని వారిని సైతం చంపేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ దొంగతనాలు, దోపిడీలతో హడలిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నేరాల నియంత్రణకు చంద్రబాబు సర్కారు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏఐ ప్రతీకాత్మక చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement