గుంటూరు జిల్లాలో 138, పల్నాడు జిల్లాలో 142 వైన్ షాపులు ఈ నెల 12 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు వెల్లడి
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఓపెన్, రిజర్వు కేటగిరీ మద్యం దుకాణాల రెన్యూవల్‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శనివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక ఏడాది కాలపరిమితికి (01.10.2026 – 30.09.2027 వరకు) గానూ ఈ కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పరిధిలో 125 ఓపెన్ దుకాణాలు, 13 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయని తెలిపారు. పల్నాడు జిల్లాలో 129 ఓపెన్, 13 గీత కులాల మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పారు.
చెల్లింపు నిబంధనలు ఇలా...
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని.. ఎవరైనా మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తిస్తే మొదటిసారి రూ.10 లక్షలు జరిమానా.. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రతి షాపులోనూ తప్పనిసరిగా సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉండాలని, వాటికి కమాండ్ కంట్రోల్ అయిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్, జిల్లా అధికారులకు యాక్సెస్ ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేస్తే మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రూ. లక్ష, మూడోసారి లైసెన్స్ రద్దు ఉంటుందన్నారు.
21వ తేదీ వరకు దరఖాస్తు గడువు
ఆసక్తిగల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏపీఎస్‌బీసీఎల్‌టీడీ.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ఎవరైనా మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోని వారు ఉంటే, సదరు షాపులకు ఈ నెల 22 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించి, 30వ తేదీన లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) వి. అరుణకుమారి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు.


