అక్రమ కేసులు, జైళ్లకు ‘ఐ డోంట్ కేర్’... 76 వార్డుల్లోనూ ఎదురొడ్డి నిలుస్తాం: అంబటి రాంబాబు ఐడీ కార్డు అలంకారం కాదు... ప్రజల పక్షాన పోరాడే బాధ్యత: నూరి ఫాతిమా డీఎస్సీ పోస్టులను టీడీపీ నాయకులు అమ్ముకున్నారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు తూర్పులో వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఘనంగా గుర్తింపు కార్డుల పంపిణీ
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రానున్న గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ షేక్ నూరి ఫాతిమా అధ్యక్షతన నిర్వహించిన తూర్పు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ప్రసంగించారు. తొలుత దివంగత మహానేత డాక్టర వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం నియోజకవర్గంలోని డివిజన్, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) పంపిణీ చేశారు.


