రాజధాని పనుల పురోగతిపై మంత్రి సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రాజధాని పనుల పురోగతిపై మంత్రి సమీక్ష

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

రాజధాని పనుల పురోగతిపై మంత్రి సమీక్ష తాడికొండ: రాజధానిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం సమీక్ష నిర్వహించారు. రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గోపాలకృష్ణారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సమీక్షలో ప్రధానంగా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. జీఏడీ టవర్‌, హెచ్‌ఓడీ టవర్లు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయనే అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు సీఆర్డీయే అధికారులు,పాల్గొన్నారు. పోలీసుల అదుపులో అంతర్జాతీయ సైబర్‌ నేరగాడు! పలమనేరు: గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సైబర్‌ నేరగాడు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. నిందితుడు పలు సైబర్‌ నేరాలకు పాల్పడి లక్షలాది రూపాయలను మోసం చేసినట్టు సమాచారం. గతంలో ఇతను ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి ఆపై అంతరాష్ట్ర సైబర్‌ నేరగాళ్లతో చేరినట్టు తెలిసింది. ఆపై ఉత్తరాది రాష్ట్రాలైన చండీఘర్‌, హరియానా, గుర్‌గావ్‌ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ చేసినట్టు సమాచారం. ఇలా సైబర్‌ నేరాల్లో ఆరితేరి చైనా దేశంలోని హాకర్లతోనూ సంబంధాలున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఓ బాధితునికి జరిగిన భారీ సైబర్‌ మోసం కేసులో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కానీ ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఫిరంగిపురం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపాలెం గ్రామానికి చెందిన కె.జోజప్ప(48) రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి నరసరావుపేట వైపునకు వెళ్తున్న స్కార్పియో ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో జోజప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్‌ బాలిక అదృశ్యం లక్ష్మీపురం: బాలిక అదృశ్యంపై నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కన్నవారి తోట 2వ లైన్‌లోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ మహిళా కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. అయితే ఈనెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు హాస్టల్‌ నుంచి బయలు దేరి కళాశాలకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు రాలేదు. హాస్టల్‌ నిర్వాహకులు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. పరిసరాలలో విచారించగా ఎంతటికి ఆచూకి తెలియక పోవడంతో బాలిక తండ్రి కె.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతులను తక్షణమే ఆదుకోవాలి జిల్లాలోప్రత్యేక తనిఖీలు నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిని గుర్తించేందుకు(ఓపెన్‌ డ్రింకింగ్‌) ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 వరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కొనసాగించారు. ముఖ్యమైన కూడళ్లు, మద్యం దుకాణాల సమీప ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు, పార్కులు, బస్‌, రైల్వేస్టేషన్ల పరిసరాల్లో, నిర్మానుష్య రహదారుల్లో సోదాలు చేయగా, 37 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, నలభై పెట్టీ కేసులు, పది మందిపై డ్రంక్‌/డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు.

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం

జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్‌

గుంటూరు రూరల్‌: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతేడాది పంట నష్టం కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్‌ అన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఓ ప్రైవేటు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు పంటలకు ఇన్స్యూరెన్స్‌ చేయించి పంట నష్టాలను జగన్‌ అందజేశాడని, కానీ నేడు టీడీపీ ప్రభుత్వం రైతులతోనే పంటలకు ఇన్స్యూరెన్స్‌ కట్టాలని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతులకు చేసిందేమీ లేకపోయినా కనీసం ఇన్స్యూరెన్స్‌, పంటనష్టాలను కూడా చెల్లించకుండా రైతులను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి గుంటూరు జిల్లాలో అన్ని మండలాలలో వర్షాభావ పరిస్థితులపై తక్షణమే సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన పరిహారం, ఇన్‌న్‌పుట్‌ సబ్సిడీ అందించాలన్నారు. వర్షాభావంతో నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement