కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన | - | Sakshi
Sakshi News home page

కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

గుంటూరు మెడికల్‌: కాంట్రాక్టు వైద్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లో కళ్లకు నల్లరిబ్బన్‌లతో గంతలు కట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది గతనెల 20 నుంచి వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నల్లరిబ్బన్‌లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి, ఉద్యోగాలు రెగ్యులరయ్యేంత వరకు నూరు శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్టు వైద్య సిబ్బందికి బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్‌నర్సులు రేణుక, బి.వి.ఆర్‌.లక్ష్మి, మేరి, శ్రీలక్ష్మి, లక్ష్మీకుమారి, పద్మావతి, ఫార్మాసిస్టులు చంద్రకళ, అశ్విని, పావని, శ్రీలక్ష్మి, ల్యాబ్‌ టెక్నీషియన్లు చారి, ఖాశిం, బాషా, సుభశ్రీ, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement