తురకపాలెం బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

తురకపాలెం బాధితులకు న్యాయం చేయాలి

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

తురకపాలెం బాధితులకు న్యాయం చేయాలి పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి

రూ.23 లక్షల స్వాధీనం పోలీసుల అదుపులో 29 మంది జూదరులు

గుంటూరు రూరల్‌: గడిచిన ఏడాదిలో నిత్యం భయం భయంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికిన తురకపాలెం గ్రామంలో జరిగిన మిస్టరీ( మెలియాయిడిసీజ్‌) మరణాల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గతంలో నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు గ్రామంలో జరిగిన మిస్టరీ మరణాల నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఈ నెల ఆఖరుకు ప్రభుత్వం అందించాల్సి ఉండగా నిష్పక్షపాతంగా నివేదికను అందించాలని కోరుతూ విదసం ఆధ్యర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. గతేడాది తురకపాలెం మిస్టరీ మరణాల సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసి చర్యల నివేదిక కోరిన నేపద్యంలో మిస్టరీ మరణాలు ఎటువంటి పక్షపాతం లేకుండా రాజకీయాలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా మళ్లీ లెక్కించి అందరికీ రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదవిధంగా బాదిత కుటుంబ సభ్యులకు ప్రత్యేక డిజాస్టర్‌ పింఛను ఇవ్వాలని డిమాండ్‌ కోరారు. కార్యక్రమంలో బాధిత గ్రామస్తులు, సుదర్శనం బ్రహ్మయ్య, విదసం జిల్లా నాయకులు నల్లపు నీలాంబరం, మూర మహేశ్‌, కొప్పుల సురేష్‌, దార్ల అర్జున్‌, ఆనంద, అనీల్‌, వినోద్‌ కుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని వైఫై రూంమ్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం దాడిచేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరుకు చెందిన ఫణి పేకాటస్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఈశ్వరరావుతో పరిచయం అయింది. ఇరువురు కలిసి నగర శివారుల్లో ఖాళీగా ఉన్న హోటల్స్‌, రూంమ్స్‌లో పేకాట నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌– 1లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు ఇద్దరితో పాటు మరో 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 27 సెల్‌ఫోన్‌లు, ఒక టూ వీలర్‌, రూ.23,771 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కృష్ణాజిల్లా, గుడివాడ, నూజివీడు, ఏలూరు, పెనమలూరు, గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న జూదరులను నల్లపాడు పోలీసులకు అప్పగించారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి జూదరులను కోర్టుకు అప్పగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement