దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా | - | Sakshi
Sakshi News home page

దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు

లక్ష్మీపురం: దళితులపై దాడులు, సామాజిక సమానతలు, వివక్ష విడనాడాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి దళితుల నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సీపీఎం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో ఆగస్టు 24న గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఈమని అప్పారావు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, కె.నళినీకాంత్‌, ఎం.రవి, బి.వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు యు.దుర్గారావు, ఎల్‌.అరుణ, డి.లక్ష్మీనారాయణ, కె.అజయ్‌కుమార్‌, బి.ముత్యాలరావు, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement