ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

గుంటూరు మెడికల్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుంటూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర 200 మీటర్ల జాతీయ జెండాతో మార్కెట్‌ సెంటర్‌ వెంకటేశ్వర విజ్ఞాన్‌ మందిరం నుంచి మార్కెట్‌ సెంటర్‌ మీదగా లిబర్టీ, కృష్ణమహల్‌ థియేటర్‌ రోడ్డులో నుంచి నాజ్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన సాగింది. ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ జెండా కోసం లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. ప్రతి భారతీయుడి ఇంటిపై జెండా ఎగరాలకోరారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ యువత చేతిలో జాతీయ పతాకం ఉంటే దేశ భవిష్యత్‌ భద్రంగా ఉంటుందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించినప్పుడే నిజమైన దేశభక్తి నిరూపితమవుతుందన్నారు. ర్యాలీలో ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, మాజీ డెప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, తిరంగా ర్యాలీ రాష్ట్ర కన్వీనర్‌ గుడిసె దేవానంద్‌, కో– కన్వీనర్లు శివారెడ్డి, సాయి లోకేష్‌, ఈదర శ్రీనివాసరెడ్డి, వెలగలేటి గంగాధర్‌, పాలపాటి రవికుమార్‌, డాక్టర్‌ టి.వి.రావు, తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ చరక కుమార్‌గౌడ్‌, కో– కన్వీనర్లు క్రిష్టిపాటి నారాయణరెడ్డి, మేడూరి యశ్వంత్‌, నడ్డి నాగమల్లేశ్వరి, భజరంగ్‌ రామకృష్ణ, కంతేటి బ్రహ్మయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement