లైవ్ డిబేట్‌కు సిద్ధమా..?
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా జీఓలను సడలించి నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నా రని ఆరోపించారు. పరీక్షలు రాయని వారికి, నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఈ ఉద్యోగాలు లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి, అధికార పార్టీ అనుకూల వర్గాలకే దక్కాయని విమర్శించారు. లాడ్డి సెంటర్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చర్చకు రావాలని పిలుపు నివ్వడం హాస్యస్పదంగా ఉందన్నారు. మేం చర్చకు వస్తే పోలీసులతో ఆపించే ప్రయత్నం చేయడంతో పాటు ఘర్షణలు జరుగుతాయనే..వీధి గొడవులకు తావు లేకుండా నీ ఇంట్లో నువ్వు.. నా ఇంట్లో నేను న్యూట్రల్ టీవీ చానల్‌లో లైవ్ డిబేట్‌కు సిద్ధమా అని అంబటి ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించేవరకు, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా గత మూడు రోజుల పాటు సాగిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. శనివారం ప్రచార కమిటీ, ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్న వారికి, వారితో సహా దీక్షల్లో కూర్చున్న పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమాకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీ పార్వతి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు.
నిరద్యోగుల జీవితాలతో చెలగాటం
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కష్టపడి ఒక్క పరీక్ష కూడా రాయని లోకేష్, ఏళ్ల తరబడి కష్టపడిన నిరుద్యోగుల జీవితాలతో వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు. కష్టపడి మెరిట్ సాధించిన పేద అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా రూ.15 లక్షలు ఇచ్చిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. మెరిట్ సాధించిన అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ బయటపెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. భారతంలో కొడుకుపై అతిప్రేమతో వంశాన్ని నాశనం చేసుకున్న ధృతరాష్ట్రుడిలా చంద్రబాబు ఉన్నారని, అవినీతిపరుడైన లోకేష్ చేస్తున్న దందాలను కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు.
నారా లోకేష్ రాజీనామా చేయాలి
పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన శాంతియుత నిరసన టెంట్లను తొలగిస్తూ పోలీసులతో ప్రజా గొంతును నొక్కుతున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో 400 ఉద్యోగాలు అమ్మారని, అసలైన అభ్యర్థులకు కాకుండా ఇతరుల పేర్లతో కాల్ లెటర్లు పంపారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతూ స్థలం, సమయం ఖరారు చేయడం లేదన్నారు. వారి స్థాయికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాకా ఎందుకు వైఎస్సార్ సీపీ చెందిన ఏ మాజీ మంత్రితోనైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.
గోల్డ్ మెడలిస్టులను పక్కన పెట్టేశారు
వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ప్రశ్నపత్రాల లీకేజీ, క్రీడా కోటా అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్టులను పక్కనపెట్టి అక్రమ మార్గాల్లో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే సీబీఐ విచారణకు అప్పగించడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, 12 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ వివిధ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముగిసిన వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్షలు
రూ.15లక్షలకు డీఎస్సీ పోస్టులు
అమ్ముకున్నారు!
నారా లోకేష్ యువగళం
పాదయాత్రలో పాల్గొన్న వారికి
టీచర్ పోస్టులు : అంబటి రాంబాబు
ధృతరాష్ట్రుడిలా చంద్రబాబు.. ఉత్తర
కుమారుడిలా లోకేష్ : లక్ష్మీ పార్వతి
ఐదు ప్రశ్నలకు సమాధానాలు
చెప్పండి : టీజేఆర్ సుధాకర్ బాబు


