గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల క్రికెట్ నాకౌట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదట ఎస్‌వైకే జట్టు... హబీబుల్లా జట్టుపై విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సాయిరామ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నారు. రెండవ సెమీ ఫైనల్‌లో చందు–11 జట్టు, 11 బుల్లెట్స్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న సాజిద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి , జి. శాంతకుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరావు క్రీడాకారులను అభినందించారు. శుక్రవారం ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌వైకే, చందు–11 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


