గుంటూరు రూరల్: వ్యక్తి తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండి, అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడంపాడు గ్రామ శివారులో గల పోగాకు గోడౌన్ వద్ద సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర రక్తగాయాలతో ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల గాయాలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించామని, మృతుడు బ్లాక్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట ధరించి ఉన్నాడన్నారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఇతను భిక్షాటన చేస్తూ ఉంటాడని తెలిసింది. మృతుడి ఆచూకీ తెలిసినవారు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా 8688831376, 8688831607 సెల్ నంబర్లలో గానీ సంప్రదించాలన్నారు.


