అంగన్‌వాడీ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలి

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

అంగన్‌వాడీ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలి

గుంటూరు వెస్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలను సంతృప్తి స్థాయిలో నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌ లో ఎల్లప్పుడూ సానుకూల స్పందన పొందేవిధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని సీడీపిఓలు, పర్యవేక్షకులకు సూచించారు. ప్రీస్కూల్‌ అటెండెనన్స్‌, ఆపార్‌ ఐడీ క్రియేషన్‌, లబ్ధిదారుని అభా ఐడీ క్రియేషన్‌, టేక్‌ హామ్‌ రేషన్‌ పంపిణీ, ఏ.ఐ.ఇ.సి.డి స్క్రీనింగ్‌, గ్రోత్‌ మానిటరింగ్‌, పి.ఎం.ఎం.వి.వై, సరుకుల నమోదు తదితర శాఖాపరమైన సూచీలకు అనుగుణంగా ఖచ్చితమైన, నాణ్యమైన డేటాను నమోదు చేసి, లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.పి.జి. ప్రసూన, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement