పెదనందిపాడు: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గుంటూరు రేంజీ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. మహిళా సిబ్బంది, ఇతర అధికారుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలు పటిష్టంగా అమలు పర్చాలని సూచించాచారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ పూర్ణచంద్రరావు, సీఐ పి.సుబ్బారావు, పెదనందిపాడు ఎస్‌ఐ ఏకనాథ్, ప్రత్తిపాడు ఎస్‌ఐ నరహరి, కాకుమాను ఎస్‌ఐ హరికృష్ణ ఉన్నారు.


