ఎన్జీ రంగా వర్సిటీతో జీఎఫ్‌ఎస్‌ఐ సంస్థ ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఎన్జీ రంగా వర్సిటీతో జీఎఫ్‌ఎస్‌ఐ సంస్థ ఒప్పందం

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

గుంటూరు రూరల్‌: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త గ్లోబల్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ ఇన్‌న్‌స్టిట్యూట్‌(జీఎఫ్‌ఎస్‌ఐ) పరిశోధన విభాగం సహా సంచాలకులు డాక్టర్‌ కాకాని విజయగోపాల్‌ మంగళవారం సందర్శించారు. ఉపకులపతి డాక్టర్‌ పీవీ సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ఎంఓయూలను మార్చుకున్నారు. భవిష్యత్‌ సహకార అవకాశాలపై చర్చించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, పంటల సాగు విధానాలు వ్యవసాయ వ్యవస్థలు భారతదేశంలోని అనేక ప్రాంతాల వ్యవసాయ పరిస్థితులతో సారూప్యతను కలిగి ఉండటంతో, అక్కడ అభివృద్ధి చేసిన సాంకేతికతలను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా అనుసరించి అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ ఆధారిత అల్గారిథమ్‌లు, డిజిటల్‌ వ్యవసాయం, కచ్చిత వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అవసరాలకు అనుగుణంగా విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అందిస్తున్న ఆనన్‌లైన్‌ కోర్సుల్లో ఎన్జీరంగా విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తలు నమోదు చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువపత్రాలు పొందే అవకాశాలను కూడా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement