తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి

గుంటూరు మెడికల్‌: సుస్థిరమైన జీవితానికి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సమించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పిటల్‌ సంయుక్తంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ తల్లిపాలు శిశువులు, చిన్నపిల్లల పోషణకు సుస్థిరమైన పోషణ విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ అనిత, డాక్టర్‌ సాహితీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ అన్నపూర్ణ, డీపీఎంఓ డాక్టర్‌ సుజాత, డీఐఓ డాక్టర్‌ వల్లిక, కిమ్స్‌ శిఖర హాస్పటల్‌ ఉప పర్యవేక్షకురాలు డాక్టర్‌ కృష్ణ ప్రభ, కార్యాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు, తల్లులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement