డాక్టర్‌ మోహనరావుకు అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ మోహనరావుకు అంతర్జాతీయ గుర్తింపు

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

మూడు ప్రతిష్టాత్మక శాసీ్త్రయ పురస్కారాలు అభినందించిన పలువురు వైద్యులు

గుంటూరుమెడికల్‌: గుంటూరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్‌ రావాస్‌ హాస్పిటల్‌– ఇంటర్నేషనల్‌ ఇనిన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్సెస్‌ వ్యవస్థాపకులు, గుంటూరుకు చెందిన ప్రముఖ చీఫ్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మోహనరావు పాటిబండ్ల ఒకే సదస్సులో మూడు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. చైన్నెలో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక శస్త్రచికిత్స సదస్సులో మూడు అవార్డులు అందుకున్నట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్న 2026 సదస్సులో డాక్టర్‌ రావు పరిశోధనకు విశేష గుర్తింపు లభించినట్లు తెలిపారు. డాక్టర్‌ రావు చేసిన పరిశోధన క్లిష్టమైన మెదడు– మెడ ఎముకల సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత సురక్షితమైన, తక్కువ గాయాలతో చేసే శస్త్రచికిత్స విధానంపై ఆధారపడిందన్నారు. వైద్య నిపుణులు ఈ పరిశోధనను వినూత్న, శాసీ్త్రయ ప్రమాణాలు, రోగులకు ఉపయోగపడే సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రతి పరిశోధన వెనుక ఒక రోగి ఉంటాడని, ప్రతి క్లిష్టమైన కేసు మనకు కొత్త పాఠం నేర్పుతుందని చెప్పారు. ఆ అనుభవాన్ని పరిశోధనగా మార్చి ప్రపంచ వైద్య సమాజంతో పంచుకోవడమే వైద్యుల లక్ష్యం అని తెలిపారు. ఈ గుర్తింపు మొత్తం వైద్య బృందానికి దక్కిన గౌరవం అన్నారు. వైద్య రంగంలో ఇలాంటి శాసీ్త్రయ అవార్డులు వ్యక్తిగత గుర్తింపునకే కాకుండా, ఆ పరిశోధన భవిష్యత్‌లో రోగుల చికిత్సకు ఉపయోగపడే అవకాశాన్ని కూడా సూచిస్తాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement