గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ద్రవ వ్యర్థాలు, మలమూత్ర శుద్ధి కేంద్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, ద్రవ వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల సమర్థ నిర్వహణ ద్వారా గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయికుమార్, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.


