గుంటూరు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
ముగిసిన తెలుగు మహాసభలు
స్వామివారికి విశేషార్చన
పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని శ్రీ భూనీళా సమేత శ్రీ వరదరాజస్వామి సోమవారం ప్రాతః కాలంలో విశేషార్చనలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డుకు సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3500, మోడల్ ధర రూ.2300 వరకు పలికింది.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 560.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు సోమవారంతో ముగిశాయి. సభలకు తెలుగు భాషాభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభల రెండో రోజైన ఆదివారం మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు హాజరయ్యారు. సభల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ పి.అశోక్‌గజపతిరాజు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాసభల సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రపంచంలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. చిన్న పిల్లలను తెలుగులోనే మాట్లాడించాలని తల్లిదండ్రులకు సూచించారు.
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


