ఆదాయం నిల్..
అంజుమన్ సంస్థకు ఏడాదికి రూ.1.50 కోటికి పైనే ఆదాయం అద్దె బాకీలు రూ.40 లక్షలు పైనే..? అంజుమన్ స్కూల్‌కు ప్రతినెలా అయ్యే ఖర్చు సుమారు రూ.3 లక్షలు పైనే.. చోద్యం చూస్తున్న సంస్థ కమిటీ, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్, మేనేజర్
అంజుమన్ సంస్థను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు...
వనరులు పుష్కలం...
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ‘‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే చందంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థ పరిస్థితి తయారైంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంజుమన్ స్కూల్‌కు, ముస్లిం సమాజం అభ్యున్నతికి, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు వంటి వాటికి వినియోగించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అంజుమన్ సంస్థకు వచ్చే ఆదాయం ఖాతాకు జమకాకపోవడంతో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆదాయ వనరులు ఇలా...
పట్టించుకోని కమిటీ
అంజుమన్ సంస్థకు కమిటీతోపాటు మేనేజర్ పనిచేస్తున్నారు. మేనేజర్ ప్రతి నెలా అద్దెలు వసూలు చేయాల్సి ఉండగా ఆయన తన సొంత పనులు చేసుకుంటున్నారే తప్ప సంస్థ గురించి పట్టించుకోవడం లేదని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. పలువురు వ్యాపారస్తుల నుంచి సుమారు రూ.40 లక్షలకు పైగా అద్దె బాకీలు ఉండటం గమనార్హం. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్‌స్పెక్టర్ స్థానికంగా ముస్లిం పెద్దలకు అందుబాటులో ఉండరని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నమాజ్‌కు వచ్చే వారికి ఇక్కట్లు
లాలాపేట, పట్నంబజారు ప్రాంతంలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తుంటారు. వీరు ఐదు పూటల నమాజ్ చేసుకునేందుకు అంజుమన్ మసీదుకు వస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నూతన కమిటీ అధ్యక్షుడుగా తూర్పు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. కమిటీ ఏర్పడిన కొద్ది కాలానికే మసీదులో వజూ ఖానా (కాళ్లు, చేతులు కడిగే ప్రదేశం)ను తొలిగించారు. వక్ఫ్ బోర్డు అనుమంతి లేకుండానే ఆ ప్రదేశంలో కొత్త దుకాణాల నిర్మాణం చేపట్టారు. నమాజ్ చేసుకునేందుకు వచ్చే వారికి స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ముస్లిం సంఘాలు ప్రశ్నించగా సంస్థకు ఆదాయం వచ్చేందుకు ఈ దుకాణాలు నిర్మిస్తున్నట్లు కమిటీ పేర్కొంది.
అంజుమన –ఏ–ఇస్లామియా సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఎవరికి వారు దోచుకుంటున్నారు. బాకీలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించే వారితోపాటు సంస్థ ఆదాయాన్ని దోచుకునే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంస్థ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నసీర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. అంజుమన్ సంస్థకు వచ్చే ఆదాయం ఎంత, బ్యాంక్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏవిధంగా వినియోగిస్తున్నారు, సంస్థ కమిటీ సభ్యులు, వక్ఫ్ అధికారులు బహిరంగంగా తెలియజేయాలి. లేని పక్షంలో ఎంతటి ఉద్యమానికై నా వెనుకాడబోం.
– షేక్.గులాం రసూల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
ఆదాయం నిల్..


