ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్–3 పనులకు శంకుస్థాపన
గుంటూరు రూరల్: మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనులకు శనివారం శిల్పారామం జంక్షన్ వద్ద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పుర పాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణలు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), స్థానిక ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్, గళ్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలసి శంకుస్థాపన చేశారు. శిల్పారామం జంక్షన్ నుంచి పేరేచర్ల వరకు రూ.48 కోట్లతో మూడో దశ నిర్మాణం చేయనున్న విషయం విదితమే. అదే విధంగా నగర పాలక సంస్థ పరిధిలోని 41, 46, 47, 48 డివిజన్ల పరిధిలో రూ.69.59 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


