భక్తిశ్రద్ధలతో శివముక్కోటి
పెదకాకానిలో మల్లేశ్వరస్వామికి
మహా రుద్రాభిషేకం
పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం నిర్వహించారు. స్వామివారికి విశేష ద్రవ్యాలతో మహన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం చేశారు. అర్చకస్వాములు 108 కిలోల అన్నంతో అన్నసూక్త పూర్వక అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరస్వామి వారికి విశేష అలంకరణ చేశారు. తొలుత శివముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున ఉత్తరద్వారంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా పూల అలంకణ చేసిన వాహనంపై భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి గ్రామోత్సవం నిర్వహించారు.


