ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

Jan 4 2026 10:57 AM | Updated on Jan 4 2026 10:57 AM

ఎన్టీ

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026 ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు నిమ్మకాయల ధరలు లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణం

న్యూస్‌రీల్‌

డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు అంటేనే లాభాపేక్ష అని చెప్పారు. విద్యార్థులు, రోగులపై పీపీపీ భారాన్ని మోపుతోందన్నారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం కోట్లాది మందికి ఉచితంగా మెరుగైన ఫలితాలు అందిస్తుందని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ అత్యధిక అసమానతలు ఉన్న సమాజంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే అసమానతలు మరింత పెరుగుతాయన్నారు. ప్రభుత్వ రంగంలో నే మెడికల్‌ కళాశాలలు కొనసాగించాలని కోరారు.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించకపోతే ఉద్యమా న్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

దళిత బహుజ ఫ్రంట్‌ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణతో బలహీన పరిచే దిశగా నడుస్తుందన్నారు.

ప్రొఫెసర్‌ డీ.ఏ.ఆర్‌.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పీపీపీ విధానం కొనసాగిస్తే రిజర్వేషన్‌లకు మంగళం పాడినట్లేనని చెప్పారు.

అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షు డు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్ర జల వైద్య అవసరాలు నెరవేర్చేందుకు వైద్య కళాశా లలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నారు.

పిల్లలకు తెలుగు భాష నేర్పించాలి : కంభంపాటి హరిబాబు

ప్రతి ఒక్కరూ తెలుగులో గర్వంగా మాట్లాడాలని, పిల్లలకు తెలుగు భాష నేర్పించాలని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు అన్నా రు. వివిధ రంగాల ప్రముఖులకు సాయంత్రం ఆంధ్రశ్రీ–పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్స వ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన హరిబాబు మాట్లాడుతూ సాహితీ కళలను ఆదరిస్తూ, తెలుగు సంస్కృతిని కాపాడాలన్నారు.

విశ్వహిందీ పరిషత్‌ అధ్యక్షుడు (న్యూఢిల్లీ) డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాల వారీగా తెలుగు సాంస్కృతిక, కళలను కాపాడేందుకు ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

గుంటూరు
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026
9న పీపీపీకి వ్యతిరేకంగా సామూహిక దీక్ష
గుంటూరు నగరంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2500, మోడల్‌ ధర రూ.1700 వరకు పలికింది.

మాచర్ల: పాత ఊరులోని లక్ష్మీచెన్నకేశవ స్వామి నిత్య కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామి కల్యాణం జరిపించారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం

శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ

చిన్నారుల నృత్య ప్రదర్శన

సాక్షిప్రతినిధి,గుంటూరు/నగరంపాలెం:మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్‌ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 శనివారం ప్రారంభమయ్యా యి. పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ సభలు జరిగాయి. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ విచ్చేసి భాష కేవలం భావ వ్యక్తీకరణకే కాదని, అది జీవన విధానమన్నారు. శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోడా రఘురామ్‌, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, కొప్పరపు కవుల సాహితీపీఠం ప్రతినిధి మా శర్మ, మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని పీవీని మరిచారు.

3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిర్వాహకులు, అతిథులు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సేవలందించిన అచ్చ తెలుగువాడు పీవీ నరసింహారావును మరిచారు. సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి, రాజ నీతిజ్ఞుడు పీవీ పేరును కనీసం తలచుకోకపోవడంతో సభకు వచ్చిన ఎంతో మంది ప్రముఖులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈనాడు రామోజీరావు పేరుతో ఏకంగా ఒక స్టాల్‌ పెట్టడమే కాకుండా ఆయన విగ్రహాన్ని కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. పత్రికాధిపతుల పేరుతో ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బహుభాషాకోవిదుడు, తెలుగులో పలు రచనలు చేసి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసిన పీవీ నరసింహారావు పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం విచారకరం. ప్రపంచ తెలుగు మహాసభలకు గుర్తుగా రూపొందించిన వీడియోలోనూ ఆయన ప్రస్తావన లేకపోవడం పట్ల పలువురు పెదవి విరిచారు.

7

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పీపీపీకి వ్యతిరేకంగా విజయవాడ లో ఈనెల 9న సామూహిక దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. శనివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సామూహిక నిరసన దీక్ష పోస్టర్లు ఆవిష్కరించారు.

సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్‌, ఎస్‌ఆర్‌ శంకరన్‌ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు బత్తుల కోటేశ్వరరావు, బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గం సాంబశివరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌.మానవేంద్రనాథ్‌రాయ్‌, పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల శేషసాయి, ఎంపీ కె.గోపీనాథ్‌ (తమిళనాడు)లు ప్రసంగించారు.

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 1
1/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 2
2/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 3
3/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 4
4/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 5
5/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 6
6/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 7
7/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు 8
8/8

ఎన్టీఆర్‌ స్తుతి... పీవీకి దక్కని చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement