ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారి
కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థులు వి. కార్తిక్, ఏ. కార్తిక్ రూపొందించిన వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టు ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారిగా ఉంది. పట్టణాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో మొక్కలు పెంచేందుకు స్థలం సరిపోక ఎదురవుతున్న సమస్యలకు విద్యార్థులు తమ ఆలోచనతో పరిష్కారం చూపారు. పెద్ద సైజు డబ్బాకు రంధ్రాలు చేసి, అందులో మట్టిని పోసి ఒకేసారి కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను పెంచారు. వర్షపు నీటి ఆధారంగా మొక్కలు పెంచే విధానంతో నీటిని కూడా ఆదా చేయవచ్చు.


