మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి | - | Sakshi
Sakshi News home page

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి

Dec 27 2025 7:47 AM | Updated on Dec 27 2025 7:47 AM

మిస్‌

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి

తాడికొండ: రాజస్థాన్‌లో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు ఫరెవర్‌ స్టార్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫేవరేట్‌ మిస్‌ టీన్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పరిటాల దివ్య ఎంపికై ంది. మిస్‌ టీన్‌ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే మొదలై ఆన్‌లైన్‌లో అండర్‌–18 విభాగంలో ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా, దేశవ్యాప్తంగా 10 వేల మంది చేసుకున్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఆడిషన్లు, గ్రూమింగ్‌, మూల్యాంకనాలు.. ఇలా వివిధ దశల్లో వడపోత అనంతరం 101 మందికి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జాతీయస్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు. వివిధ అంశాలో ప్రతిభ ప్రదర్శించిన పరిటాల దివ్య టైటిల్‌ హోల్డర్‌గా నిలిచి ఫేవరెట్‌ మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఎన్నిక య్యారు. ఆమెకు కిరీటంతో పాటు గుర్తింపు పతకం ఇచ్చి అభినందించారు.

గణనీయంగా పెరిగిన మల్లేశ్వరస్వామి ఆదాయం

పెదకాకాని: శివాలయంలో మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు డెప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ తెలిపారు. పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం హుండీలు తెరిచి, కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా లాలాపేట గ్రూపు దేవస్థానాల సహాయ కమిషనర్‌ పెళ్లూరి సుభద్ర హాజరయ్యారు. ఆలయ హుండీల ద్వారా 71 రోజులకు 64,18,291 రూపాయల ఆదాయం లభించినట్లు లీలాకుమార్‌ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్‌లోని హుండీ ద్వారా 7,80,953 రూపాయలు సమకూరిందన్నారు. బంగారం 0.043 గ్రాముల 190 మిల్లీగ్రాములు, వెండి 364.200 గ్రాములు వచ్చిందన్నారు. మూడు అమెరికన్‌ డాలర్లు ఉన్నట్టు తెలిపారు.

మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనమే ‘సారస్‌’

గుంటూరు వెస్ట్‌: సారస్‌–మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్‌ తెలిపారు. సారస్‌ (సేల్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ రూరల్‌ఆర్టిస్ట్స్‌ సొసైటీ) ప్రదర్శనశాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలసి సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారన్నారు. 250కి పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ముఖేష్‌కు రజతం

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో శుక్రవారం గుంటూరుకు చెందిన నేలపల్లి ముఖేష్‌ రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ జూనియర్‌ విభాగంలో ముఖేష్‌ రజత పతకం గెలుపొందాడన్నారు. సీనియర్‌ జూనియర్‌ విభాగాల్లో పోటీపడిన ముఖేష్‌ రిలేలో 600కు గాను 579 పాయింట్లు సాధించి సీనియర్లలో నాలుగో స్థానం జూనియర్లలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఏషియన్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌ జూనియర్‌ విభాగంలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత,టీం,మిక్స్‌డ్‌, 25 మీటర్ల స్పోర్డ్స్‌ పిస్టల్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌, రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడన్నారు. ముఖేష్‌ను ఆంధ్రప్రదేశ్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సలలిత్‌ తదితరులు అభినందించారు.

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి 1
1/3

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి 2
2/3

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి 3
3/3

మిస్‌ టీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement