బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
గుంటూరు రూరల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటాలు చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగా అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంగవీటి మోహన్‌రంగా 37వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని చిల్లీస్ సెంటర్ వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల కోసం ప్రాణాల్ని సైతం అర్పించిన మహా నాయకుడు రంగా అని కొనియాడారు. తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజుల్లో కూడా విజయవాడలో ఘన విజయం సాధించిన వ్యక్తి రంగా అని గుర్తు చేశారు. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసిన యోధుడు రంగా అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, రాష్ట్ర కుమ్మరి శాలివాహన విభాగ అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రాము, వడ్డానం శివ, పార్టీ నాయకులు బత్తుల దేవానంద్, రాచకొండ ముత్యాలరాజు, ఇంద్ర, జల్లేపల్లి వేణు, నాగిరెడ్డి, శేషం సుబ్బారెడ్డి, డొక్కు కాటంరాజు యాదవ్, తాళ్ల వీరయ్య, దుంపాల రాధా, వై. కోటి, రజియాబేగం, కొల్లూరు శివప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.


