గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌

Dec 23 2025 7:02 AM | Updated on Dec 23 2025 7:02 AM

గుట్ట

గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌

గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌

బాల్‌ టు బాల్‌కు పందెం వంద రూపాయల నుంచి పది వేల వరకు పందేలు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లు అరెస్ట్‌ రూ.13.60 లక్షలు, ఆన్‌లైన్‌లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్‌, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ సీజ్‌

నగరంపాలెం: ఆన్‌న్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లు కేసులో ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హోలులో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. సోమవారం టాస్క్‌ఫోర్స్‌ సమాచారంతో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్‌ పర్యవేక్షణలో పట్టాభిపురం పీఎస్‌ సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వికాస్‌ నగర్‌ మూడో వీధిలోని ఓ డాబాపై ఆకస్మిక తనిఖీలు చేశారు. హాలులో ఇద్దరు టేబుల్‌ ఎదురు కూర్చొని ఉండగా, మరో ఆరుగురు ఫోన్లల్లో బెట్టింగ్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌ తొమ్మిదో మ్యాచ్‌ (సిడ్నీ థండర్‌/బ్రిస్‌బానే హార్ట్‌) బెట్టింగ్‌ నిర్వర్తించే క్రమంలో వీరందర్ని పట్టుకున్నారు. నిర్వాహకుడైన తాతినేని శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి, కొరిటెపాడు నాలుగో వీధికి చెందిన షేక్‌ సలీం అలియాస్‌ శ్రీను, తిరుమలశెట్టి నాగు, శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న కోటపాటి వెంకటరెడ్డి, పొన్నూరు రోడ్‌ సాయిబాబాకాలనీ ఒకటో వీధి వాసి దొడ్డా శ్రీకాంత్‌, బృందావన్‌ గార్డెన్స్‌ ఏడో వీధిలో ఉంటున్న జిల్లేలమూడి బ్రహ్మతేజ, నెహ్రునగర్‌ తొమ్మిదో వీధికి చెందిన పల్లె సుధాకర్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.13.60 లక్షలు, ఆన్‌లైన్‌లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్‌, ల్యాప్‌టాప్‌, ఎనిమిది సెల్‌ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో నల్లచెరువు మేనకగాంధీనగర్‌కు చెందిన తాతినేని శ్రీనివాసరావు గత పదేళ్లుగా ఆనన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కొరిటెపాడు పార్కు వెనుక ఉండే యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలసి శ్రీనివాసరావు బెట్టింగ్‌లు నిర్వహించే వాడని చెప్పారు. ఇద్దరూ ఒక బెట్టింగ్‌లను పలువురికి అలవాటు చేశారని, యాప్‌ల ద్వారా బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌ నిర్వహించే వారని వివరించారు.

పేకాటలో మోసం

అంతర్జాతీయ, జాతీయ, లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల వేళ తాతినేని శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ గ్రూప్‌లోని సభ్యులకు సమాచారం చేర వేసేవాడని ఎస్పీ తెలిపారు. పీచ్‌ ఈఎక్స్‌సీహెచ్‌ యాప్‌ సంబంధించి లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు పంపించి బెట్టింగ్‌లు చేసేవాడని వివరించారు. ఇదిగాక శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలిసిన వ్యక్తులతో పేకాట ఆడేవాడని చెప్పారు. ఇందులో సెల్‌ఫోన్‌, రిస్ట్‌ వాచీ, చెవిలో బ్లూ టూత్‌ ఉపయోగించి మిగతా ఆటగాళ్లను మోసగించేవాడన్నారు. ఆటగాళ్లకు ఫోన్‌పేల నగదు చెల్లించేవారని, వంద నుంచి పదివేల రూపాయల వరకు పందేలు ఉంటాయని తెలిపారు. అరెస్ట్‌ చేసిన ఎనిమిది మందిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ చెప్పారు. పీచ్‌ ఈఎక్స్‌సీహెచ్‌ యాప్‌ వెనుక ఎవరూ ఉన్నారనేది విచారిస్తున్నామని, గత పదేళ్లల్లో శ్రీనివాసరావుపై ఒక్క కేసు నమోదై ఉందని వెల్లడించారు. కేసుని ఛేదించిన డీఎస్పీలు అరవింద్‌ ( గుంటూరు పశ్చిమ), శ్రీనివాసులు (ఎస్‌బీ), సీఐలు అలహరి శ్రీనివాస్‌ (ఎస్‌బీ), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్‌), ఎస్‌ఐ నాగేంద్ర, పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.

గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ 1
1/1

గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement