ప్రతి గడపకు సంక్షేమం అందించిన జగన్
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. తొలుతగా 53 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో భారీగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నేతలు, యువకులు, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంతోష సంబరాల నడుమ ఒక పండుగ వాతావరణంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి పేద గడప ముందుకు సంక్షేమాన్ని పంపిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగన్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టారని, దానిలో భాగంగానే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏడాది రక్తదానం చేసే వారి సంఖ్య పెరుగుతోందని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఏకై క నేత వైఎస్ జగన్ అని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో సాటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఎంతో అవసరమని, అటువంటి పరిస్థితుల్లో ఎంతో మందికి ప్రాణదానం చేసేందుకు రక్తం ఇవ్వటం అభినందనీయమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో సభ్యుడి పుట్టినరోజుగా ఎంతో ఆప్యాయంగా జరుపుకుంటున్నారన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం, చదలవాడ రవీంద్రనాథ్, పఠాన్ సైదాఖాన్, సత్తెనపల్లి రమణీ, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, సీహెచ్ వినోద్, సీడీ భగవాన్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, యేటి కోటేశ్వరరావు, కానూరి శశిధర్, భాను, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
అంబటి రాంబాబు
గుంటూరులో జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 240 మంది


