మాదక ద్రవ్యాలతో సమాజానికి పెనుముప్పు
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జేకేసీ కళాశాలలో నిర్వహించిన ‘‘రోటోఫెస్ట్–2025’’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికృష్ణ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ అనేది మానవాళి ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అనేక మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధులు మామిడి సుబ్బారావు, నంబూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రవి కిరణ్, ఏవీ హరనాథ్ బాబు, గార్లపాటి రవి కిరణ్, ముప్పవరపు వెంకట సత్యనారాయణ, పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు, ఈగల్ సీఐ విక్టర్, ఎస్సై సునీల్ బాబు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ


