
‘హర్ ఘర్ తిరంగా’
డీఆర్‌ఎం కార్యాలయంలో
లక్ష్మీపురం: ప్రతి పౌరుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం సుదేష్టసేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతి పౌరుడు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారి త్యాగాలను మరువకూడదన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరూ హర్‌ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు. అనంతరం పట్టాభిపురం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి గుంటూరు రైల్వేస్టేషన్ వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్‌ఎం ఎం.రమేష్ కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హానూర్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్ బాబు, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ సైలేషన్ కుమార్, డివిజన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభించిన
డీఆర్‌ఎం సుదేష్ట సేన్