
ఇలా నివారించవచ్చు...
పిల్లల్లో మూడు రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. అవి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు. వీటిని నిర్మూలించేందుకు అల్బెండజోల్ మాత్రను తీసుకోవాలి. మాత్రను భోజనం తరువాత తీసుకోవాలి. మాత్ర వేసుకున్న ఒక రోజు లేదా రెండు రోజుల్లో నులి పురుగులు ఉన్నట్లయితే మల విసర్జన ద్వారా బయటకు వెళ్తాయి. మాత్రలను దీర్ఘకాలిక రోగులు, ఇతర మందులు వాడుతున్న వారు కూడా తీసుకోవచ్చు.
– డాక్టర్ తిమ్మాపురం చంద్రశేఖర్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు, గుంటూరు.