
4,61,955 మందికి పంపిణీ
జిల్లాలోని 148 కాలేజీలు, 1,480 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,677 పాఠశాలల్లో 4,61,955 మంది 19 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వీరందరికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశాం. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 12న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నాడు మాత్రలను మింగని వారికి ఈ నెల 20న మాప్–అప్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలను మింగేలా చూస్తాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, గుంటూరు.