శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

Aug 10 2025 6:04 AM | Updated on Aug 10 2025 6:04 AM

శంకర్

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

గుంటూరు ఎడ్యుకేషన్‌ : గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులను ఆర్‌ అండ్‌ బీ శాఖాధికారులు శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచే జేసీబీలతో శంకర్‌విలాస్‌ వైపు నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. దాదాపు 70 ఏళ్లుగా నగరంలో ప్రజా రవాణాకు కీలకంగా మారి, సేవలందించిన ఈ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించడంతో స్థానికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితోపాటు బాటసారులు, ఆటో కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. బ్రిడ్జితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని, అక్కడకు వచ్చి సెల్ఫీలు తీసుకుని జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించిన అధికారులు సాయంత్రం వరకు నిరంతరాయంగా పనులు చేయించారు. నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.

బాలచాముండేశ్వరి అమ్మవారికి గాజులతో అలంకారం

అమరావతి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని అమరేశ్వరాలయంలోని బాల చాముండేశ్వరి దేవిని శనివారం గాజులతో శ్రావణ లక్ష్మీగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రేఖ మాట్లాడుతూ బాల చాముండేశ్వరి దేవికి అలంకరించిన గాజులను రేపటి నుంచి ముత్తయిదువలకు పంపిణీ చేస్తామన్నారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు కాసుల పేరు

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.ఐదు లక్షల విలువైన బంగారు కాసుల పేరును కానుకగా అందచేశారు. గుంటూరు దేవపురానికి చెందిన జీఎన్‌ కామరాజ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈవో శీనానాయక్‌కు బంగారం, పగడాలు, కెంపులతో తయారు చేయించిన 48 గ్రాముల కాసుల పేరును అందచేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.

నాగార్జున కొండకుపర్యాటకులు రాక

విజయపురిసౌత్‌: ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీరి ద్వారా లాంచీస్టేషన్‌కు 45,000 రూపాయల ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్‌ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.

నేడు తెరుచుకోనున్న సాగర్‌ క్రస్ట్‌ గేట్లు

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ఆదివారం మళ్లీ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను అధికారులు తెరవనున్నారు. ఉదయం 5 గంటలకు రెండు క్రస్ట్‌ గేట్లు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ సీజన్‌లో గేట్లు రెండో సారి తెరవనున్నారు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకు సాగర్‌ నీటి మట్టం 589.80 అడుగులు ఉండగా, ఇది 311.4474 టీఎంసీలకు సమానం.

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం 1
1/4

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం 2
2/4

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం 3
3/4

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం 4
4/4

శంకర్‌విలాస్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement