
‘తొలితరం తెలుగు రచయిత్రులు’ పుస్తకావిష్కరణ
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్‌న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య సీహెచ్.సుశీలమ్మ రచించిన తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ నిర్వహించారు. కేంద్ర సాహితీ అకాడమి అనువాద పురస్కార గ్రహీత పి.సత్యవతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు అంకితం చేసి సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో గ్రంథాన్ని విశ్లేషిస్తూ కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగించారు. ఈ పుస్తకంలో వితంతు, సీ్త్రల బాధలను, వాటి వెనుకనున్న సామాజిక దుర్మార్గాన్ని, అస్పృశ్యత, అంటరానితనం, అగ్రవర్గ దురహంకారం వంటి అనేక విషయాలను ప్రస్తావించడం విశేషమని అన్నారు. ఈ పుస్తకంలో 1902 నుంచి 1955 వరకు రచించిన కథ, రచన చేసిన 25 మంది కథారచయిత్రుల రచనలను పరిచయం చేయడంతో పాటు రచయిత్రుల జీవన రేఖలను అందించడం మంచి విశేషమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకావిష్కరణ సత్యవతి, సుశీల, రచయిత్రి అతిథులను సత్కరించారు.