అంగన్‌వాడీలకు యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు యాప్‌సోపాలు

Aug 11 2025 6:49 AM | Updated on Aug 11 2025 6:49 AM

అంగన్

అంగన్‌వాడీలకు యాప్‌సోపాలు

నెహ్రూనగర్‌: అంగన్‌వాడీ కార్యకర్తలు యాప్‌లతో ఆపసోపాలు పడుతున్నారు. పాత ఫోన్లలో ముఖ చిత్ర గుర్తింపునకు పడరానిపాట్లు పడుతున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా ముఖ చిత్ర గుర్తింపు చేయాల్సిందే. అలా చేయకుండా ఆహార పదార్థాలను అందించలేరు. యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవడంతో సకాలంలో ముఖ చిత్ర గుర్తింపు ప్రక్రియ జరగకపోవడంతో ఇటు లబ్ధిదారులు, అటు అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు పడలేని అంగన్‌వాడీ కార్యకర్తలు ఇటీవలే గుంటూరు అర్బన్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

ప్రాథమిక విద్యా బోధనకు ఆటంకం

అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 12 రకాల రికార్డులు నిర్వహించాల్సి వస్తోంది. లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నమోదు చేసే రికార్డులు (ఎస్‌ఎన్‌ఎన్‌), ఫ్రీ స్కూల్‌ అడ్మిన్‌ విద్యార్థుల వివరాలు ప్రతి నిత్యం విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. వాటితోపాటు పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రిజిస్టర్‌, విటమిన్‌–ఎ రికార్డు, రిఫరల్‌ సర్వీసెస్‌ గృహ సందర్శకుల రికార్డులు నిర్వహించాలి. వీటితోపాటు నెలవారీ ప్రాజెక్టు (ఎంటీఆర్‌), ఆయా అంగన్‌వాడీల పరిధిలోని గ్రోత్‌ రికార్డు, గ్రోత్‌ చార్టులతోపాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించి టేక్‌ హోమ్‌ రేషన్‌ పంపిణీ రికార్డు, స్టాప్‌ అడ్మిషన్‌ రిజిస్టర్‌ నిర్వహించాల్సి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల పిల్లలకు ప్రాథమిక విద్య బోధించేందుకు సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.

పనిచేయని పాత ఫోన్లు

అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన మొబైల్‌ ఫోన్లు పాతవి కావడంతో నెట్‌వర్క్‌ కష్టాలు అధికంగా ఉంటున్నాయి. మొబైల్స్‌ ర్యామ్‌ తక్కువగా ఉండటంతో తక్షణమే యాప్‌ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌ నమోదులో ఆలస్యమైతే అధికారుల వేధింపు ఎక్కువయ్యాయని వాపోతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న బాలలకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పోషకాహారం ఇచ్చేవారు. ఎక్కువ మంది తమకు ఇంటి వద్దకే పోషకాహారం కావాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో టీహెచ్‌ఎర్‌ (టేక్‌ హోమ్‌ రేషన్‌)గా మార్చారు. పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు దఫాలుగా అందిస్తున్నారు. ఇవన్నీ పంపిణీ చేయాలంటే వారందరి పూర్తి వివరాలను పోషణ యాప్‌ ద్వారా రెండుసార్లు నమోదు చేయాల్సి ఉంది. టీహెచ్‌ఆర్‌ కోసం ఒకే లబ్ధిదారును రెండుసార్లు ముఖ యాప్‌ ద్వారా గుర్తించాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. నెలలో ఎక్కువ సమయం ఈ పనికే వినియోగించడం వల్ల చిన్నారుల ప్రాథమిక విద్య బోధనకు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు.

బాలింతలు, గర్భిణుల గుర్తింపునకు అవస్థలు లబ్ధిదారుల ముఖ గుర్తింపునకు ముప్పుతిప్పలు పాత ఫోన్లతో తలనొప్పులు నెట్‌ వర్క్‌ లేక బాలసంజీవని, పోషణ ట్రేకర్‌ అప్‌లోడ్‌ సమస్య

5జీ ట్యాబ్‌లు ఇవ్వాలి

అంగన్‌వాడీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన ఫోన్లలో ప్రస్తుత యాప్‌లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఒక పక్క లబ్ధిదారుల ఫేక్‌ క్యాప్చర్‌ జరిగితేనే పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉంది. యాప్‌లు పనిచేయక పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలి. దీంతో అంగన్‌వాడీలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి 5జీ ట్యాబ్స్‌ ఇవ్వాలి.

– దీప్తి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

సాగని పోషకాహార పంపిణీ

అంగన్‌వాడీలకు యాప్‌సోపాలు 1
1/1

అంగన్‌వాడీలకు యాప్‌సోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement