
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటిస్తూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రరాజు ఆదివారం తెలిపారు. గుంటూరు అర్బన్ పరిధిలో అన్ని యాజమాన్యాల్లోని 540 పాఠశాలల్లో 3వ తరగతి నుంచి టెన్త్ వరకు చదువుతున్న 50 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ చేపట్టిన ‘‘వార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’ ప్రాజెక్టును ఈనెల 12న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభించనున్నారని వివరించారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులతో పర్యావరణానికి వాటిల్లుతున్న హాని, కాలుష్యాన్ని నివారించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారి ఉపయోగించుకుని రోడ్డు పక్కన పడవేసే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సేకరించేందుకు ప్రాజెక్టు ద్వారా రూపకల్పన చేశామని చెప్పారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘‘వార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’ ప్రాజెక్టుకు రూపకల్పన ఈనెల 12న గుంటూరులో ప్రారంభించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్