
ప్రజాభీష్టం మేరకు బ్యాలెట్ విధానం మంచిదే
గుంటూరు ఎడ్యుకేషన్: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పరిణామమేనని, ఈ విషయంలో ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరులో నగరం బృందావన్‌గార్డెన్స్‌లో రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ నివాసానికి వచ్చిన జానారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్సీ కేతావతు శంకర్‌నాయక్‌లు అనారోగ్యానికి గురైన శివాజీని పరామర్శించారు. ఈసందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ మిత్రుడు శివాజీని కలుసుకోవడం ఆనందంగా ఉందని, రైతాంగ సమస్యలపై ఆయనతో కలిసి పని చేశానని గుర్తు చేశారు. యువతరం రాజకీయాల్లోకి రావాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలంటే అందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ఈవీఎంలను బ్యాలెట్ పేపర్‌తో మార్చడంలో తప్పులేదన్నారు.
తెలంగాణ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గుంటూరులో రాజ్యసభ మాజీ సభ్యుడు శివాజీకి పరామర్శ