చెత్త నుంచి సంపద సృష్టిపై దృష్టి పెట్టాలి
పెదకాకాని: చెత్త నుండి సంపద సృష్టించడంపై దృష్టి సారించాలని గుంటూరు జిల్లా డీపీఓ నాగసాయికుమార్ అన్నారు. పెదకాకాని గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డు వద్ద జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో డీపీఓ పాల్గొన్నారు. డీపీఓ మాట్లాడుతూ జిల్లాలో పది వేలకు పైగా జనాభా ఉన్న పది గ్రామాలను ఎంపిక చేసి సంపద సృష్టిపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా పెదకాకాని మండలంలోని పెదకాకాని, నంబూరు గ్రామాలను ఎంపిక చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


