శుభాకాంక్షలు తెలిపిన అంబటి, లేళ్ల, మోదుగుల
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): జిల్లా ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం వేర్వే రు ప్రకటనల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరంలో అందరు ఆనందంగా జీవించాలని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): స్కాట్‌లాండ్ దేశానికి చెందిన మద్యాన్ని గుంటూరు ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ డాబా వద్ద నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఇతర దేశానికి చెందిన మద్యం) కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి స్కాట్‌లాండ్ దేశానికి చెందిన 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చైన్నె పోర్టు నుంచి తెప్పించుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ఈదాడిలో ఈఎస్‌టీఎఫ్ సీఐ నయనతార, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన అంబటి, లేళ్ల, మోదుగుల
శుభాకాంక్షలు తెలిపిన అంబటి, లేళ్ల, మోదుగుల


