పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా | - | Sakshi
Sakshi News home page

పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా

Jan 1 2026 11:09 AM | Updated on Jan 1 2026 11:09 AM

పచ్చ

పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా

పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా లచ్చన్నగుడిపూడి (తాడికొండ): తాడికొండ మండలం లచ్చన్నగుడిపూడి గ్రామంలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పగలు అనుమతులు ఉన్న ప్రాంతం నుంచి అరకొరగా తరలిస్తున్న ఓ ప్రైవేటు నిర్మాణ కంపెనీ.. రాత్రి వేళ మాత్రం వందల సంఖ్యల లారీలతో అనుమతులు లేని ప్రాంతం నుంచి గ్రావెల్‌ తరలిస్తోంది. సర్వే నెంబర్‌ 111/బీ, బీ1, బీ3, బీ5, బీ6, బీ7, బీ8 లలో రాజధానిలో రోడ్లు వేస్తున్న ఓ నిర్మాణ కంపెనీకి చెందిన వ్యక్తికి గ్రావెల్‌కు అనుమతులు ఇచ్చారు. సర్వే నెంబర్‌ 113లో గతంలో అనుమతులకు మించి తవ్వకాలు జరిగాయి. ఆ క్వారీకి పక్కన భూమిని కొనుగోలు చేసి సాగుకు అనుకూలంగా లేని కారణంగా మట్టి తవ్వకానికి దరఖాస్తు చేశారు. రేయింబవళ్లు తవ్వకాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం 20 అడుగుల మేర తొలగించాలి. వందల అడుగుల లోతులో తవ్వేసి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాజధాని పనుల నేపథ్యంలో గ్రావెల్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ గ్రామంలో గ్రావెల్‌ పొలాలు ఎక్కువగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. ఇటీవల మోతడక గ్రామంలో అసైన్డ్‌ భూమిలో 200 అడుగులకుపైగా పొలాలను అక్రమంగా తవ్వి రూ. కోట్ల గ్రావెల్‌ తరలించేశారు. ఇప్పుడు లచ్చన్నగుడిపూడిలో పక్క పొలాలకు నష్టం జరిగేలా గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఒకే వే బిల్లుతో అనేక లారీలను రాత్రివేళ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

అధికార పార్టీ అండతోనే..

అధికార పార్టీకి చెందిన షాడో వత్తాసుతోనే ఇదంతా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమదీ అధికార పార్టీ అయినా రాత్రివేళ అడ్డుకొని అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదున్నారు. పైగా దాడులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కుర్రా శ్రీధర్‌పై టీడీపీ నాయకుడు దాడి చేసిన ఆధారాలతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మూత్రపిండాలు దెబ్బతిని చాలామంది చనిపోవడంతోపాటు పలువురు డయాలసిస్‌ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు అనుమతులు

ఉన్నచోట మైనింగ్‌

రాత్రి వేళ అనుమతులు

లేని ప్రాంతంలో తవ్వకాలు

రాజధానికి యథేచ్ఛగా భారీగా

గ్రావెల్‌ తరలింపు

ప్రైవేటు కాంట్రాక్టు

కంపెనీ నిర్వాకం

అర్ధరాత్రి గ్రామస్తులు

అడ్డుకున్నా ఫలితం శూన్యం

అధికారుల నిర్లక్ష్యంపై

సర్వత్రా విమర్శలు

పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా1
1/1

పచ్చ పార్టీ అండగా యథేచ్ఛగా అక్రమార్కుల దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement