సఖీ నివాస్ ప్రారంభం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరంపాలెంలోని మహిళా ప్రాంగణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (సఖీ నివాస్)ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటీజన్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం రూ. 2.27 కోట్లతో సఖీ నివాస్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఐసీడియస్ పీడీ కె.విజయలక్ష్మీ, ఆర్జెడి జయలక్ష్మి, మహిళా సహకార ఆర్థిక సంస్థ జిల్లా మేనేజర్ రమణశ్రీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజ, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


