అంటువ్యాధులు ప్రబలనివ్వకండి | Sakshi
Sakshi News home page

అంటువ్యాధులు ప్రబలనివ్వకండి

Published Wed, Dec 6 2023 1:54 AM

- - Sakshi

జిల్లా పంచాయతీ అఽధికారి శ్రీదేవి

గుంటూరు వెస్ట్‌: తుఫాను బీభత్సం కారణంగా గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబల కుండా సిబ్బంది పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి మంగళవారం సూచించారు. గ్రామాల్లోనూ, శివారు ప్రాంతాల్లోనూ, వాగు గట్టున ఉన్న వారిని గుర్తించి వారికి తగు సూచనలు చేయాలన్నారు. వర్షపు నీరు ఉన్నచోట విష సర్పాలు, క్రిమికీటకాలతో కొంత ప్రమాదముంటుందని చెప్పారు. అవకాశమున్నంత వరకు విద్యుత్‌ అంతరాయ ఏర్పడకుండా చూడాలన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నింపుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్నా తక్షణం స్పందించి సహకారమందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ జి. రాజకుమారిల ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

భార్యను వేధించిన భర్తకు జైలు

సత్తెనపల్లి: భార్యను వేధించిన కేసులో భర్తకు జైలు శిక్ష విధిస్తూ రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గౌస్‌ మొహిద్దీన్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద కూరపాడు మండలం ముసాపురం గ్రామానికి చెందిన దాసరి రాజ్యలక్ష్మి 2017 నవంబర్‌ 1న తన భర్త రాంబాబు మానసికంగా, శారీరకంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గుంటూరు దిశా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వాదోవాదనల అనంతరం మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రాజ్యలక్ష్మిని మానసికంగా, శారీరకంగా వేధించినందుకు రాంబాబుకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు అపరాధ రుసుము విధిం చారు. అంతేకాక అదనపు కట్నం కోసం వేధించినందుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ప్రసాద్‌ నాయక్‌ వ్యవహరించారు.

అన్నదాతలకు అండగా ప్రభుత్వం

సహకార, మార్కెటింగ్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి

కారంచేడు: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుందని సహకార, మార్కెటింగ్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన మండలంలోని యర్రంవారిపాలెం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద విలేకర్లతో మాట్లాడారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అనేక మంది రైతులతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. కలెక్టర్‌లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి అవసరమైన సూచనలు చేశారన్నారు. అధికార యంత్రాంగం చేసిన కృషితో నష్ట తీవ్రత లేదన్నా రు. కేవలం వరి, పొగాకు, శనగ, మొక్కజొన్న వంటి పంటలను మాత్రమే రైతులు నష్టపోయారన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వరద తీవ్రత తగ్గిన వెంటనే సంబంధిత అధికారు లు, సిబ్బంది పంట నష్టం అంచనాలు వేస్తారన్నారు. వీటి ఆధారంగా పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ఎవ్వరూ అధైర్య పడొవద్దన్నా రు. ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమైన ప్రతి అధికారికి అభినందనలు తెలిపారు. మండలంలోని యర్రంవారిపాలెం గ్రామంతోపాటు మరికొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటును ఆయన అభినందించారు. ఆయన వెంట యర్రం లక్ష్మారెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, స్ధానిక నాయకులు, రైతులున్నారు.

డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

చీరాల: పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో డ్రెయినేజీ కాలువలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. భారీ వర్షం కురవడంతో డ్రెయినేజి పొంగి పొర్లుతోంది. మంగళవారం మధ్యాహ్నం అతడిని గుర్తించిన స్థానికులు బయటకు తీశారు. అప్పటికే అతడు మరణించాడు. మద్యం మత్తులో పడిపోయి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతు డి వద్ద లభించిన ఆధార్‌ ఆధారంగా అతడి పేరు పోండ్రంగ డాక్టర్‌గా, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వద్ద నివాసముంటున్న వ్యక్తిగా గుర్తించారు. ఒన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

ఆహార ప్యాకెట్లు పంపిణీ

బాపట్ల అర్బన్‌: బాపట్లలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని 5వేల మంది బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రోటరీ కల్యాణ మండపంలో వంటశాల ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి వంటకాలను చేపట్టారు. ఉద యం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలను యుద్ధ ప్రాతిపదికపై సిద్ధం చేశారు. వివిధ వాహనాల ద్వారా బాధితులకు పంపిణీ చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు, సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌ స్వయంగా పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి బాధితులకు అందజేసే ఆహార ప్యాకెట్లను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement