నిన్నటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ : మహిళా ఆర్‌జే ఆత్మహత్య? సీఎం దిగ్భ్రాంతి! | What Went Wrong RJ Simran tradedy tragic step Last IG Post goes viral | Sakshi
Sakshi News home page

నిన్నటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ : మహిళా ఆర్‌జే ఆత్మహత్య? సీఎం దిగ్భ్రాంతి!

Dec 27 2024 12:36 PM | Updated on Dec 27 2024 12:36 PM

What Went Wrong RJ Simran tradedy tragic step Last IG Post goes viral

ఎపుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయింది. తనను తాను జమ్మూ కీధడ్కన్ అని పిలుచుకునే  పాపులర్‌ ఆర్‌జే సిమ్రాన్‌  సింగ్‌ తన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.  సోషల్‌ మీడియాలో స్టార్లుగా ఎదిగి, లక్షల అభిమానులను సంపాదించుకుని, ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో జీవితంలో మరో ఉదయం లేకుండా చేసుకోవడం విషాదం.

గురుగ్రామ్ అద్దె అపార్ట్‌మెంట్‌లో సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకొంది. రాత్రి పదిన్నర గంటలకు ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సిమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సిమ్రాన్ మనస్తాపంతో ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కానీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎలాంటి సూసైడ్‌  నోట్‌ కూడా లభించలేదు. 

మరోవైపు ఆర్జే సిమ్రాన్ చివరి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నెల (డిసెంబర్)13న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రీల్‌ను పోస్ట్ చేసింది.  'బీచ్‌ ఒడ్డున అంతులేని ముసిముసి నవ్వులతో ఉన్న అమ్మాయి'  అంటూ చాలా సంతోషంగా కనిపించింది.  చక్కటి ఫోటోలను పోస్ట్‌ చేసింది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి గుండెల్లో రగిలిన బడబానలం ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతాపం
జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఆయన యంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు.  సిమ్రాన్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.

 సిమ్రాన్ ఆత్మహత్య వార్త  దావానలంలా వ్యాపించడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. ఏమైంది, ఎందుకు  ఇంత పనిచేసింది, అంటూ  కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో హ్యాపీగా ఉన్నంత మాత్రాన, వారి జీవితాల్లో ఆనందం ఉన్నట్టు  కాదు.. వాస్తవం మరోలా ఉంటుందనే విషయాన్ని ఆమె నిష్క్రమణ రుజువు చేసిందంటూ మూడో  యూజర్‌ కమెంట్‌ చేయడం గమనార్హం​.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement