ఎన్టీ స్కాన్‌ అంటే ఏంటీ? దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

What Is an NT Scan For Down Syndrome - Sakshi

నాకిప్పుడు 3వ నెల. రొటీన్‌ స్కాన్‌లో బేబీ NT థికనెస్‌ 3.5 సెం.మీ ఉంది అని డాక్టర్‌ చెప్పారు. అది మంచిది కాదన్నారు. స్కాన్‌ మెషిన్‌ తప్పేమో అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మళ్లీ ఎప్పుడు స్కాన్‌ చేయించుకోవాలి?
– డి. అమరజ, బళ్లారి

NT(న్యూకల్‌ ట్రాన్‌స్లుసెన్సీ) స్కాన్‌ అనేది టైమ్‌ బౌండ్‌తో ఉంటుంది. అంటే 11–13 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలోనే చేయించుకోవాలి. సమయం తక్కువ కాబట్టి సెకండ్‌ ఒపీనియన్‌గా వెంటనే వేరే చోట అంటే ఫీటల్‌ మెడిసిన్‌ యూనిట్‌లో పనిచేసే డాక్టర్‌తో చేయించండి. పుట్టబోయే బిడ్డకు మెడ వెనుక చర్మం కింద నార్మల్‌గానే కొంచెం ఫ్లూయిడ్‌ ఉంటుంది. సాధారణంగా దీనిని మూడవ నెల ప్రెగ్నెన్సీలో NT స్కాన్‌లో చెక్‌ చేస్తారు. అది 3.5 సెం.మీలోపు ఉంటే ఏ సమస్యా ఉండదు. NT థిక్‌నెస్‌ బేబీది 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే ‘Icreased NT’ అంటారు. ఈ కేసులో గర్భస్రావం అయ్యే చాన్సెస్‌ ఎక్కువ ఉండొచ్చు.

బిడ్డ గుండెకు సంబంధించి ఏదైనా అబ్‌నార్మాలిటీ ఉండొచ్చు. లేదా క్రోమోజోమల్‌ అబ్‌నార్మాలిటీ అంటే డౌన్స్‌ సిండ్రోమ్‌(Down Syndrome) లాంటివి ఉండొచ్చు. కానీ ఒక్క NT థిక్‌నెస్‌ పైనే డయాగ్నసిస్‌ చేయరు. మీ బ్లడ్‌ టెస్ట్‌ కూడా చెక్‌ చేసి రెండిటినీ కలిపి చేసే టెస్ట్‌ని కంబైడ్‌ ఫస్ట్‌ ట్రైమిస్టర్‌ స్క్రీనింగ్‌ అంటారు. ఆ టెస్ట్‌ చేయించుకోండి. ఇందులో ‘లో రిస్క్‌’ అని వస్తే ప్రమాదం తక్కువ అని అర్థం. ‘హై రిస్క్‌’ అని వస్తే ఫీటస్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌ని కలిస్తే వాళ్లు కౌన్సెలింగ్‌ చేస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా వారంలో వచ్చేస్తాయి. ఈ పరీక్షల రిపోర్ట్‌ని బట్టే తర్వాత స్కాన్‌ ఉంటుంది. హై రిస్క్‌ కేసెస్‌లో నాల్గవ నెలలో ఉమ్మనీరు చెక్‌ చెస్తారు.

దీనిని Amniocentesis అంటారు. ఈ టెస్ట్‌ ఫైనల్‌ కన్ఫర్మేషన్‌ ఏదైనా మేజర్‌గా  క్రోమోజోమ్‌ ప్రాబ్లమ్‌కి సంబంధించి ఉంటుంది. ఈ రిపోర్ట్‌ రిజల్ట్‌ని బట్టే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ధారిస్తారు.  చాలాసార్లు NT ఒక్కటి 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉన్నా బయాకెమిస్ట్రీ టెస్ట్‌ అంటే బ్లడ్‌ టెస్ట్‌ని కూడా కలిపి రిస్క్‌ అసెస్‌మెంట్‌ చేస్తారు. లో రిస్క్‌ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు.. ఏ ప్రాబ్లం లేదని అర్థం. అప్పుడు 5, 7, 9వ నెలల్లో స్కాన్స్‌ ఉంటాయి. కానీ కొంతమంది గర్భిణీల్లో అంటే మేనరికం పెళ్లిళ్లు అయిన కుటుంబంలో జెనెటిక్‌ లేదా క్రోమోజోమల్‌ అబ్‌నార్మాలిటీస్‌ ఉన్నా.. డయాబెటిస్‌.. ఇమ్యూన్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నా.. ఫీటస్‌ మెడిసిన్‌ కౌన్సెలర్‌ని కలిస్తే ఈ పరీక్షలన్నీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెల మొదట్లోనే చేసి కౌన్సెలింగ్‌ ఇస్తారు.  

(చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్‌ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top