కర్ణాటక: స్కానింగ్ కు వెళ్లిన మహిళను అసభ్యంగా తాకి రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బెంగళూరు నగరశివారులోని అనేకల్‌లో జరిగింది. ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో రేడియాలజిస్ట్‌గా పనిచేసే జయకుమార్ నిందితుడు. ఇటీవల మహిళ కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్‌కు రాసిచ్చారు. ఆమె భర్తతో కలిసి స్కానింగ్ సెంటర్ కు వెళ్లింది. స్కానింగ్ చేసే నెపంతో మహిళ చేతులు, ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అడ్డుచెప్పగా దూషించి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన ను మహిళ తన మొబైల్‌లో రికార్డు చేసుకుంది. ఆమె ఆనేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది, అయితే పోలీసులు కామాంధుడు జయకుమార్ ను ఇంతవరకు అరెస్ట్‌చేయలేదు. ఊరికే విచారించి పంపించేశారు. బాధితురాలు బెంగళూరు రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామాంధున్ని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


