బయటికి వచ్చాక గుర్తొస్తుందా? ఏదో మిస్‌ చేశానని..! | Smart Gadgets To Solve Everyday Forgetting Problems | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ గాడ్జెట్లు ఉంటే చాలు.. మతిమరుపుకు చెక్‌!

Oct 4 2026 12:48 PM | Updated on Oct 4 2026 1:00 PM

Smart Gadgets To Solve Everyday Forgetting Problems

ఫండే

TECK టమారం

చిన్న చిన్న మతిమరపులే ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఇలాంటి రోజువారీ మరపులకు తిరుగులేని మంత్రాలే ఈ స్మార్ట్‌ గాడ్జెట్లు!

తాళాల లాకర్‌!
ఇంటికి తాళం వేయటం కాదు. ఆ తాళం చెవులను దాచిపెట్టడమే అసలైన భద్రత! అందుకే, చాలామంది తాళం చెవులను దాచడానికి ఇంట్లో కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారు. ఈ బ్రెయిన్‌  వర్క్‌కు కాస్త బ్రేక్‌ ఇవ్వడానికి వచ్చిందే ఈ కీ లాకర్‌. ఇంటి బయట గోడకు అమర్చుకునే ఈ చిన్న మెటల్‌ బాక్స్‌లో అదనపు తాళం చెవులను భద్రంగా పెట్టుకోవచ్చు.

నాలుగు అంకెల కోడ్‌ పెట్టుకుని. అవసరమైనప్పుడు పిన్‌  ఎంటర్‌ చేసి బాక్స్‌ తెరిచి చెవి తీసుకోవచ్చు. స్నేహితులు, బంధువులు లేదా ఇంటి పనివాళ్లు మనం లేని సమయంలో ఇంట్లోకి రావాల్సి వచ్చినా ఇది ఉపయోగపడుతుంది. పని అయిపోయాక కోడ్‌ను మార్చేస్తే సరి. సుమారు ఏడు తాళం చెవులు పెట్టుకునేంత స్థలం ఉంటుంది. దుమ్ము, తేమ, తుప్పు నుంచి రక్షణ ఉండేలా రూపొందించారు. ధర రూ. 700 మాత్రమే!

రిమోట్లన్నింటికీ బాస్‌!
కేవలం అవసరమైనప్పుడు మాత్రమే కనిపించకుండా పోయే వస్తువుల్లో రిమోట్‌దే మొదటి స్థానం! అంతేకాదు, టీవీకి ఒక రిమోట్‌... ఏసీకి మరో రిమోట్‌... ఇలా ఇంట్లో ఉండే ఏ ఒక్క రిమోట్‌ కనిపించకపోయినా ఇల్లంతా జల్లెడ పట్టాల్సిందే. ఇకపై ఈ రిమోట్‌ గందరగోళానికి చెక్‌ పెట్టే, చిన్న మంత్రమే ఈ మ్యాజిక్‌ క్యూబ్‌. ఒక్కసారి వైఫైకి కనెక్ట్‌ చేస్తే చాలు.

మొబైల్‌ యాప్‌ ద్వారా టీవీ, ఏసీ వంటి ఇన్‌ ఫ్రారెడ్‌ పరికరాలను ఆన్‌, ఆఫ్‌ చేయొచ్చు. అంటే రిమోట్‌ ఎక్కడుందో వెతికే బదులు ఫోన్‌  ఎక్కడుందో చూసుకుంటే చాలు! టైమర్‌ పెట్టుకోవచ్చు. సీన్‌ లు సెట్‌ చేసుకోవచ్చు. అలెక్సాతోనూ కనెక్ట్‌ చేసుకోవచ్చు. చిన్న క్యూబ్‌లా కనిపించినా, ఇంట్లోని రిమోట్లన్నింటికీ ఇది ఒక్కటే బాస్‌! ధర రూ. 1000.

స్విచ్‌ వేయకుండానే, పని పూర్తి!
ఇంట్లోంచి బయటికి వచ్చాకే గుర్తొస్తుంది.. గీజర్‌ ఆఫ్‌ చేశామా? ఏసీ స్విచ్‌ అలాగే ఉందా? మళ్లీ ఇంటికి వెళ్లి చెక్‌ చేయాలా అనే టెన్షన్‌ ! అందుకే, ఈ చిన్న స్మార్ట్‌ ప్లగ్‌ ఉంటే ఆ గోలే ఉండదు. సాధారణ ప్లగ్‌లా కనిపించే ఈ వైఫై స్మార్ట్‌ ప్లగ్‌ను గీజర్, ఏసీ, మైక్రోవేవ్‌ ఓవెన్‌  వంటి విద్యుత్‌ అవసరమయ్యే పరికరాలకు ఉపయోగించుకోవచ్చు.

మొబైల్‌లోని యాప్‌తో కనెక్ట్‌ చేసుకొని, ఎక్కడి నుంచైనా వాటిని ఆన్‌ , ఆఫ్‌ చేయొచ్చు. అంతేకాదు.. ఏ పరికరం ఎంత విద్యుత్‌ ఖర్చు చేస్తుందో కూడా గమనించవచ్చు. అలా కరెంట్‌ బిల్లు చూసి షాక్‌ అవ్వడం కంటే.. ముందే వినియోగాన్ని తగ్గించొచ్చు కూడా! రోజూ ఒకే సమయానికి ఆన్‌  లేదా ఆఫ్‌ షెడ్యూల్‌ కూడా పెట్టుకోవచ్చు. అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌తో వాయిస్‌ కమాండ్‌ కూడా ఇవ్వొచ్చు. ధర రూ.1,000.

ఇదీ చదవండి: మెన్స్‌ ఫ్యాషన్‌లో ‘పర్సనల్‌ టచ్‌’.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement