
వెండి, బంగారం మాట ఎత్తాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి. ఊహించని రీతిలో పెరిగి ఆకాశా న్నంటాయి. సామాన్య మానవులే కాదు, ధనవంతులు కూడా గోరెడు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. మరీ వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో ఎక్స్‌లో ఒక ట్వీట్‌వైరల్‌గా మారింది. దేశంలోని పలు నగరాల్లోని వెండి ధరల అంతరాలపై ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. దీని కథా కమామిష్షు ఏమింటే..
ఫుడ్ కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఆమె ఏమంటుంది అంటే.. అక్టోబరు 14 నాటికి వెండి ధరలు పోలుస్తూ ఈ రైలు ప్రయాణం ద్వారా మీకు రూ.14వేల ఆదా చేసుకోవచ్చు ట్వీట్ చర్చకు దారితీసింది. ఆమె లెక్క ఆన్‌లైన్‌లో అటు వ్యాపారులు , ఇటు సాధారణ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది.
అక్టోబర్ 14న దేశంలోని రెండు భారతీయ నగరాల్లో 1 కిలో వెండి ధర ఇలా ఉన్నాయి
అహ్మదాబాద్: రూ. 1,89,000
విశాఖపట్నం: రూ. 2,06,000
1 kg Silver Price
- Ahmedabad: ₹1,89,000
- Visakhapatnam: ₹2,06,000
Return Train (Ahmedabad → Visakhapatnam): ₹2,000
Gross Profit: ₹17,000
Tax: ₹510
Net Profit: ₹14,490 (per trip, ~3 days)
If repeated 3–4 times a month, total monthly profit ≈ ₹43,000 – ₹58,000— Nalini Unagar (@NalinisKitchen) October 14, 2025
రెండు నగరాల మధ్య రైలు టికెట్ ధర దాదాపు రూ. 2,000. అంటే తక్కువగా ఉన్న నగరంలో వెండిని కొనుగోలుచేస్తే ప్రయాణ ఖర్చులు , ప్రాథమిక పన్నులు తరువాత ట్రిప్‌కు సుమారు రూ. 14,490 నికర లాభం ఉంటుందని అంచనా వేసింది. అంటే నెలకు 3–4 సార్లు చేస్తే చాలు రూ. 43వేల నుంచి రూ. 58వేలకు సంపాదించవచ్చు అని ఆమె పేర్కొంది.
చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
దీనిపై భిన్న స్పందనలు వినిపించాయి. ఈ రేటులో భారీ వ్యత్యాసం ఉంది. కొనుగోలు ధర రూ. 2 లక్షలు అయితే, అమ్మకపు ధర రూ. 1.8 లక్షలు. కాబట్టి, మీరు అహ్మదాబాద్‌లో రూ. 1.89 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, అదే ధరకు ఇక్కడ విక్రయించలేరు కదా ఒకరు ప్రశ్నించారు.
సాధారణంగా వెండి ధరల్లో అంత తేడా ఉండదు. ( మరీ 17 వేలంత). ధరలు జాతీయంగా నియంత్రించబడతాయి. పైగా వెండిపై GST 3శాతం జీఎస్‌టీ. లాభాల్లో జీఎస్‌టీ భారం ఉంటుంది. పైగా మీరు రిజిస్టర్డ్ GST డీలర్ అయి ఉండాలి, చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ ఇన్‌వాయిస్, ఇ-వే బిల్లును కలిగి ఉండాలి కాబట్టి మీ మరింత పన్నుభారం తప్పదు. పైగా వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాబట్టి విశాఖపట్నం చేరుకునే సమయానికి, ధర తగ్గితే, లాభం కాస్త నష్టంగా మారవచ్చు కదా అంటే కమెంట్ చేశారు. మీ "లాభం" నష్టంగా మారుతుంది. అయితే బులియన్ మార్కెట్లు, ధరలు స్థానిక డిమాండ్-సరఫరా, లాజిస్టిక్స్ ఖర్చులు, రాష్ట్ర పన్నులు ,డీలర్ మార్జిన్లు వంటి అంశాల కారణంగా ఈ తేడాలుంటాయనేది గమనించాలంటున్నారు బులియన్‌మార్కెట్ నిపుణులు.
ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!