అజిత్‌కు ఖరీదైన కానుక.. ఫార్ములా ఈ కారు గిఫ్ట్‌! | Mahindra gifts Formula E themed SUV to actor Ajith Kumar | Sakshi
Sakshi News home page

కొత్త కారుతో స్టార్‌ హీరో అజిత్‌.. ధర ఎంతంటే?

Mar 14 2026 12:54 PM | Updated on Mar 14 2026 1:41 PM

Mahindra gifts Formula E themed SUV to actor Ajith Kumar

ఇరాన్‌తో.. అమెరికా-ఇజ్రాయెల్ వివాదం కారణంగా దుబాయ్‌లో కొంతకాలం చిక్కుకుపోయిన ప్రముఖ నటుడు & రేసర్ 'అజిత్ కుమార్' ఈ వారం ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత.. కొత్త ''మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ'' కారును సొంతం చేసుకున్నారు. దీనిని మహీంద్రా అండ్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో BE 6 ఫార్ములా E కారుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ధరలు రూ. 23.69 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అజిత్ కుమార్ టాంగో రెడ్ వేరియంట్‌ BE 6 ఫార్ములా E కొనుగోలు చేశారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ అని తెలుస్తోంది.

మహీంద్రా ఫార్ములా కారుతో ఉన్న అజిత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ''సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ వెల్లడిస్తూ.. త్వరలో ఒక రోజు నేను ఆయనకు వ్యక్తిగతంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాను'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement