బొమ్మను చూస్తే నీలా ఉంది! అమ్మాయికి సంబరమంట! | Same Day Delivery Customised Chocolate Gifts in Warangal | Sakshi
Sakshi News home page

Customised Chocolate Gifts బొమ్మను చూస్తే నీలా ఉంది!

May 3 2025 10:02 AM | Updated on May 3 2025 10:50 AM

Same Day Delivery Customised Chocolate Gifts in Warangal

పుట్టినరోజు జరుపుకొనే వారి ఫొటోలతో చాక్లెట్లు 

కవర్‌పై ఫొటో చూసుకుంటూ మురిసిపోతున్న పిల్లలు  

వరంగల్‌లో విస్తరించిన కొత్త సంస్కృతి

సాక్షి, వరంగల్‌: పుట్టినరోజు కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఎవరైనా పుట్టినరోజు స్నేహితులకు చాక్లెట్లు ఇవ్వడం సాధారణమే. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఈ చాక్లెట్లలో ప్రత్యేకత ఉంది. 

పుట్టినరోజు చేసుకుంటున్న వారి ఫొటోలను చాక్లెట్‌ కవర్‌పై ముద్రిస్తున్నారు. వాటిని స్నేహితులు, తోటి విద్యార్థులకు ఇస్తూ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్‌ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటిని ఇక్కడ తయారు చేస్తున్న సంస్థ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారి నుంచి ఆర్డర్‌ తీసుకుంటూ.. పిల్లలకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు తమ ఫొటోతో ముద్రించిన చాక్లెట్లు మిత్రులకు ఇస్తూ సంబర పడిపోతున్నారు.  

అందరికీ నచ్చేలా.. టేస్టీగా.. 
ఈ చాక్లెట్లు పిల్లల్నే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిపొడి, కొబ్బరి నూనె, తేనె కలిపి వివిధ పద్ధతుల్లో తయారు చేసే ఈ చాక్లెట్ల రుచికి అందరూ ఫిదా అవుతుండటంతో వీటికి మార్కెట్లో యమ డిమాండ్‌ పెరుగుతోంది. వరంగల్‌ కేంద్రంగా ప్రారంభమైన ఓరుగల్లు హోంమేడ్‌ చాక్లెట్ల (ఓరుగల్లు ఫొటోస్‌ ర్యాపర్‌ హోంమేడ్‌ చాక్లెట్లు) గురించి సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వెనుకాడడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ పట్టణాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఈ స్చంస్థ నిర్వాహకులు కరుణాకర్, సందీప్‌ చెబుతున్నారు.

చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!
 

మా అమ్మాయి సంబరపడింది
పరకాలలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మా కుమార్తె ఆరుషి ఒకటో తరగతి చదువుతోంది. ఓరుగల్లు హోంమేడ్‌ చాక్లెట్ల గురించి ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా తెలుసుకొని ఆర్డర్‌ ఇచ్చాం. పాప ఆరుషి ఫొటో చాక్లెట్ల కవర్‌పై ఉండటంతో తెగ సంబరపడిపోయింది. వారి పాఠశాలల్లోని ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చాక్లెట్ల గురించి వాకబు చేశారు.  
– డి.రవళి, పరకాల

Advertisement
 
Advertisement
Advertisement